బాలీవుడ్ ప్రముఖ నటి స్వర భాస్కర్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఫహద్ అహ్మద్‌ను కోర్టు వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరూ జనవరిలో కోర్టు వివాహం చేసుకున్నారు. ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో పెళ్లిపీటలెక్కారు.
పెళ్లి వేడుకల్లో భాగంగా ఢిల్లీ వేదికగా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు స్వరా-ఫహద్. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
రిసెప్షన్‌లో స్వర, ఫహద్‌ల జోడీ చాలా అందంగా కనిపించింది. స్వర భాస్కర్ పింక్ లెహంగా ధరించగా, ఫహద్ అహ్మద్ ఆఫ్ వైట్ షేర్వానీలో కనిపించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సెప్షన్ పార్టీలో స్వర- ఫహద్ ఇద్దరూ ఒకరికొకరు హత్తుకుని రొమాంటిక్ పోజులిచ్చారు లవ్లీ కపుల్. అతిథుల ముందే స్వర భాస్కర్‌ను ముద్దాడి తన ప్రేమను చాటుకున్నాడు ఫహద్.
ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా హల్దీ, సంగీత్, మెహందీ, ఖవ్వాలీ నైట్ ఈవెంట్లు వేడుకగా నిర్వహించారు. తాజాగా గ్రాండ్‌గా రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేశారు.