
బాలీవుడ్ యాక్టర్ కమ్ విలన్ చుంకీ పాండే, వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అనన్యా పాండే. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

2019లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అనన్యా పాండే పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుందీ ముద్దుగుమ్మ

పతి పత్ని ఔర్ వో','డ్రీమ్ గర్ల్ 2' తదితర సినిమాల్లో అనన్యా పాండే నటనకు మంచి మార్కులు పడ్డాయి. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన సై-ఫై థ్రిల్లర్ 'CTRL' కూడా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.

అన్నట్లు తెలుగు ఆడియెన్స్ కు కూడా అనన్యా పాండే పరిచయమే. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న అనన్యా పాండే సడెన్ గా ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించింది. జ్యోతిర్లింగాల యాత్రను మొదలు పెట్టినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఈ మేరకు తన యాత్రకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తోంది అనన్యా పాండే. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.