
బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన వాళ్లలో చాలా మంది తెలియని మొఖాలే ఉన్నాయి. వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.

సీజన్ 5 లో పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ లో 7ఆర్ట్స్ ఛానెల్ ఫాలో అయ్యే వారికి సరయూ గురించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు.

బోల్డ్ గా సరయూ చేసిన కంటెంట్ కి కుర్రకారు బాగా కనెక్ట్ అయిపోయారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కేవలం సరయూ కోసమే బిగ్ బాస్ చూసే వారుకుండా ఉన్నారు.

ఇక మొదటి రోజు నుంచే సరయూ తనదైన మాటలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. హౌస్‌లో ఈమె నడుచుకునే తీరు.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అనేది చూడాలి.