
మోడల్‌గా కెరీర్ మెదలుపెట్టి, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది సొట్టబుగ్గల చిన్నది దివి వైద్య. ఇక బిగ్‌బాస్ 4వ సీజన్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.

హౌజ్‌లో తనదైన ఆటతీరు, అందంతో ఆకట్టుకున్న ఈ చిన్నది టైటిల్ గెలుచుకోలేకపోయిన్పటికీ ప్రేక్షకుల హృదయాలను మాత్రం కొల్లగొట్టింది. ఈ షోతో దివికి వరుస సినిమాలు క్యూ కట్టాయి.

ఇటీవల మోస్ట్ డిజైరబుల్ టైటిల్‌ను గెలుచుకుందీ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మోస్ట్ డిజైరబుల్ టైటిల్‌ను గెలుచుకున్నట్లు తనకు ఫోన్ రాగానే ఉక్కిరిబిక్కిరి అయిపోయానని, ఆ ఆనందం తట్టుకోలేకపోయానని చెప్పుకొచ్చింది.

ఇక నటపై ఉన్న ఆసక్తితో ఆడిషన్స్‌కు వెళ్లగా ప్రతిసారి రిజెక్ట్ అయ్యానని.. ఏకంగా 100కు పైగా ఆడిషన్స్‌లో తనను తిరస్కరించారని చెప్పింది దివి. అయితే.. ఇలా రిజెక్ట్ అయిన ప్రతీసారీ మరింత స్ట్రాంగ్ అయ్యానని చెప్పుకొచ్చింది.

పెద్ద స్టార్ల చిత్రాల్లో నటించాలనేది తన కల అని చెప్పిన దివి.. ప్రస్తుతం అది సాకారం అవుతోందని చెప్పుకొచ్చింది. ఈ రోజు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నానని తెలిపిన ఈ బ్యూటీ మెగా స్టార్‌తో నటిస్తోన్న సినిమా మరో మూడు నెలల్లో ప్రారంభంకానుందని తెలిపింది.