
యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిన్నది ఆషూ రెడ్డి. జూనియర్ సమంతలా ఫ్యాన్స్ ను ఆకట్టుకొని బుల్లితెరపైకి అడుగుపెట్టింది. తర్వాత తన అందం, అల్లరితనంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

బిగ్ బాస్‌లోకి వెళ్లి మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. తన ఆటతీరు, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడు బుల్లితెరపై చాలా షోలలో మెరిచింది.

ఇక రామ్ గోపాల్ వర్మతో కూడా ఈ అమ్మడు చేసిన అల్లరి మాములుగా లేదు. వర్మను ఇంటర్వ్యూ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. తాజాగా పరికిణిలో తన అందాలను కుర్రకారుకు ఎరగావేసి, తన గ్లామర్‌తో చంపేస్తుంది.

ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో లంగావోణిలో చాలా అందంగా ఉన్నావు జూనియర్ సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు ఫ్యాన్స్.