2 / 5
వయొలెన్స్ కా బాప్ అంటూ యానిమల్ సినిమా గురించి సీరియస్‌గా రంగంలోకి దిగి మరీ ప్రచారం చేశారు సందీప్‌రెడ్డి వంగా. రీసెంట్ టైమ్స్ లో ఏ ఫిల్మ్ మేకర్ చేయనటువంటి అటెంప్ట్ యానిమల్ డ్యూరేషన్ విషయంలో చేస్తున్నారు సందీప్. రణ్‌బీర్, రష్మికి జంటగా నటించిన ఈ సినిమా మీద నార్త్, సౌత్ అనే తేడా లేకుండా హైప్ క్రియేట్ అయింది. సినిమాలో ఏమాత్రం స్పార్క్ ఉన్నా వెయ్యి కోట్ల మార్కును టచ్ చేసే మూవీ అవుతుందనే మాట వినిపిస్తోంది ట్రేడ్ పండిట్స్ నుంచి.