Ashwini Dutt: నిర్మాత అశ్వనీదత్ మూడో కూతురి నిశ్చితార్థం.. సందడి చేసిన సినిమా తారలు.. ఫొటోస్ ఇదిగో

Updated on: Oct 04, 2025 | 10:28 PM

టాలీవుడ్‌లో సీనియర్ నిర్మాత గా పేరున్న అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన మూడో కూతురు స్రవంతి త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఇటీవల ఆమె నిశ్చితార్థం హైదరాబాద్‌ వేదికగా ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

1 / 6
1.	వైజయంతి ప్రొడక్షన్ బ్యానర్‌ అధినేత అశ్వనీ దత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారాయన.

2 / 6
 అశ్వనీదత్ కూతుళ్లు కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి, సీతారామం తదితర చిత్రాలను నిర్మించి వైజయంతీ బ్యానర్‌ కు పునర్వైభవం తీసుకొచ్చారు

3 / 6
 ఇక గతేడాది ప్రభాస్ తో నిర్మించిన కల్కి సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అయ్యింది. ఈ సినిమా సుమారు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

4 / 6
 అశ్వనీదత్ పెద్ద కూతురు స్నప్న, రెండో కూతురు ప్రియాంక, అల్లుడు నాగ్ అశ్విన్ గురించి  చాలామందికి తెలుసు. అయితే ఆయన మూడో కూతురు స్రవంతి గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలీదు.

5 / 6
 ఇటీవల స్రవంతి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని అశ్వనీదత్ ఇంట్లోనే ఈ శుభాకార్యం జరిగినట్లు తెలుస్తోంది.   పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

6 / 6
 తాజాగా స్రవంతి ఎంగేజ్ మెంట్ ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఇవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. అయితే అశ్వనీదత్ కు కాబోయే అల్లుడు ఎవరో మాత్రం తెలియరాలేదు.