
అందరిదీ ఒక దారైతే, మాది మరో దారి అని అంటున్నారు ఆ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు. అనుష్క, అండ్ త్రిష... మరీ అస్తమాను ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టే ప్రవర్తిస్తున్నారు. మా రూట్స్ సౌత్‌లో ఉన్నాయి. అందుకే మా రూట్ కూడా సౌత్‌లోనే అని కచ్చితంగా చెప్పేస్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త గట్టిగానే స్పీడ్ పెంచారు అనుష్క. లేడీ లక్ అంటూ నవీన్ పొలిశెట్టితో కలిసి సక్సెస్ చూశారు. ఆల్రెడీ మలయాళంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. తెలుగులోనూ క్రిష్ డైరక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఇన్ని సినిమాలు చేస్తున్నా, బాలీవుడ్ సినిమాల వైపు మాత్రం చూడటం లేదు ఈ బ్యూటీ.

అటు త్రిష కూడా ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించేస్తున్నారు. ఏళ్లు గడిచేకొద్దీ, ఈ బ్యూటీ అందం పెరుగుతోందేంటీ అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకునేంత గ్లామరస్‌గా కనిపిస్తున్నారు చెన్నై సోయగం. తెలుగు, తమిళ్‌లో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నా, హిందీని మాత్రం దూరం పెడుతున్నారు త్రిష.

హీరోయిన్స్ అనుష్క శెట్టి అండ్ త్రిష కృష్ణన్ ఇద్దరు కూడా నిజంగానే బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రాజెక్టులు వద్దనుకుంటున్నారా? లేకుంటే అక్కడి నుంచి వీళ్లకు పిలుపు రావడం లేదా? అనే అనుమానాలు కూడా చాల వరకు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్టులన్నీ ప్యాన్ ఇండియా రిలీజుల వైపు పరుగులు తీస్తున్న ఈ టైమ్‌లో, వీళ్లిద్దరు కూడా అతి త్వరలోనే నార్త్ ప్రమోషన్లకు హాజరు కాక తప్పదు అన్నది క్రిటిక్స్ తరఫున వినిపిస్తున్న మాట. మరి చుడాలిక వీరిద్దరి సౌత్ ఇండస్ట్రీకే పరిమితం అవుతారా.? లేక హిందీలో కూడా చేస్తారు.