
లేడీ లక్ లేడీ లక్ అంటూ అనుష్కతో కలిసి స్టెప్పులేసిన నవీన్ పొలిశెట్టి అతి త్వరలో మణిరత్నం డైరక్షన్‌లో సినిమా చేస్తారంటూ సోషల్ మీడియాలో న్యూస్ యమాగా ట్రెండ్ అవుతోంది. నవీన్ సంగతి సరే, అనుష్క నెక్స్ట్ ఏంటి అనే టాపిక్ కూడా సైమల్‌టైనియస్‌గా స్ప్రెడ్ అవుతోంది.

ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ఘాటీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సమ్మర్‌లో రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడింది. నెక్స్ట్ ఎప్పుడు అనేదాని మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

కానీ, ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఘాటీ మీద హోప్స్ పెంచేస్తోంది. మరోవైపు మలయాళంలో కథనార్‌లో నటిస్తున్నారు అనుష్క. ఈ మూవీ కోసం మలయాళం కూడా నేర్చుకున్నారు ఈ బ్యూటీ.

బాహుబలి ప్రమోషన్ల టైమ్‌లోనే మలయాళం మాట్లాడటానికి ట్రై చేశారు అనుష్క. ఇప్పుడు లాంగ్వేజ్ స్కిల్‌ని మరింతగా ఇంప్రూవ్ చేసుకున్నారు కథనార్ కూడా ఎండింగ్ స్టేటస్‌లోనే ఉంది. లేటెస్ట్ గా సుందర్. సి అనుష్కకు ఓ కథ చెప్పారట.

హారర్ కామెడీ సినిమాల స్పెషలిస్టుగా పేరుంది సుందర్.సి.కి. ఇప్పుడు ఆయన చెప్పిన కథ.. అనుష్క కెరీర్‌లో మరో అరుంధతి అవుతుందనే టాక్ నడుస్తోంది కోలీవుడ్‌లో. సుందర్.సి. జస్ట్ డైరక్షన్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తారట ఈ మూవీకి.