Rajeev Rayala |
Nov 01, 2023 | 1:51 PM
టాలీవుడ్ లో అందాల భామగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో పరిచయం అయ్యింది.
ఆ తర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది అనుపమ.
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కార్తికేయ 2 , 18 పేజెస్ లాంటి హిట్స్ అందుకుంది ఈ చిన్నది.
ఇక అనుపమ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తన సినిమా అప్డేట్స్ తో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతున్న ఫొటోస్ ను షేర్ చేసింది అను. ఈ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.