
తెలుగులో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తక్కువ సమయంలోనే తెలుగులో యంగ్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో ఈ ముద్దుగుమ్మకు గుడి కట్టేశారు. కానీ ఒకప్పుడు తనకు నటించడమే రాదని ట్రోల్ చేశారట.

ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ? తనే అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఆమె తెలుగులో పరదా సినిమాలో నటిస్తుంది. అలాగే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాలోనూ కనిపించనుంది. ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది.

తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించిన అనుపమ.. మలయాళంలో మాత్రం తక్కువ సినిమాల్లో నటించింది. తాజాగా విషయంపై స్పందించిన అనుపమ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నా

జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వంటి గొప్ప చిత్రంలో ఎంపిక చేశారని.. విమర్శలు తనలో ఆలోచనలు మరింత పెంచాయని.. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. లాక్ డౌన్ సమయంలో తన కెరీర్ పరంగా, జీవితంలోనూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని తెలిపింది.

తనపై నమ్మకంతో ఇలాంటి పాత్రను ఇవ్వడం తనకు దక్కిన విజయంగా భావిస్తున్నట్లు తెలిపింది. తనకు మద్దతు ఇచ్చినవారికి.. అలాగే తనను ద్వేషించిన వారికి కృతజ్ఞతలు తెలిపింది అనుపమ. ప్రస్తుతం అనుపమ నటిస్తున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇందులో జానకిగా అనుపమ.. లాయర్ గా ప్రముఖ నటుడు సురేష్ గోపి కనిపించనున్నారు.