
అను ఇమ్మాన్యుయేల్.. తెలుగు సినిమా ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. దేశాలు దాటి హీరోయిన్ కావాలని టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అందం, అభియనయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ వరుస అవకాశాలు అందుకుంది.

కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. దాదాపు మూడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది అను. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో సందడి చేస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసింది. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

చివరగా తమిళంలో జపాన్, తెలుగులో ఊర్వశివో రాక్షసివో చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమా చేయలేదు. కానీ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో దుర్గ పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ వస్తాయా అనేది చూడాలి.

హిట్టు అందుకున్నప్పటికీ అవకాశాలు రావడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా కొన్నాళ్లపాటు సినిమాల్లో మెరిసి.. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమైన తారలు..ఇప్పుడు హిట్టు అందుకున్నా ఆఫర్స్ కోసం వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ది గర్ల్ ఫ్రెండ్ విజయంతో మరోసారి అను పేరు వినిపిస్తుంది.

అయితే ఈ బ్యూటీకి ఇప్పుడు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు వస్తాయా ? రాదా ? అనేది చూడాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాలతో సందడి చేస్తుంది. క్రేజీ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది. మరీ చూడాలి.. ఇక ఈ అమ్మాడికి అవకాశాలు వస్తాయో లేదో.