
యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బ్యూటీ త్రిప్తి దిమ్రీ. ఒక్క పాటతోనే నేషనల్ సెన్సేషన్‌గా మారిన ఈ భామ బాలీవుడ్‌లో లాంగ్ జర్నీని కోరుకుంటున్నారు. అందుకే ఓ గ్లోబల్ బ్యూటీని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ.

యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ, యానిమల్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమాలోని ఆమె మెయిన్ లీడ్ కానప్పటికీ.. హీరోయిన్ రష్మిక కంటే ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. త్వరలో ఆమె పలు ఆఫర్లను చేజిక్కించుకోవడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

యానిమల్ సినిమాకు ముందు త్రిప్తి అనే హీరోయిన్ ఇండస్ట్రీలో ఉన్న సంగతే ఆడియన్స్‌కు తెలీదు. కానీ యానిమల్ రిలీజ్ తరువాత ఓవర్ నైట్ స్టార్ లీగ్‌లో ఫ్లాష్ అయ్యారు ఈ బ్యూటీ. ఆరేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా రాని గుర్తింపు ఈ సినిమాలో చేసిన ఒక్క పాటతో వచ్చింది.

ప్రజెంట్ కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఈ భామ తనకు ఓ బాలీవుడ్ సీనియర్ నటి ఇన్‌స్పిరేషన్ అంటున్నారు. బాలీవుడ్లో కెరీర్ స్టార్ట్ చేసి హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిన ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ జర్నీనే తనకు ఇన్‌స్పిరేషన్ అన్నారు త్రిప్తి దిమ్రి.

'బర్ఫీ సినిమాలో ప్రియాంకను తొలిసారి చూసినప్పుడు గుర్తు పట్టలేకపోయా... ఒక నటికి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. అలాంటి ఓ గొప్ప నటి ప్రియాంక చోప్రా' అన్నారు త్రిప్తి. అందుకే సిల్వర్ స్క్రీన్ జర్నీ విషయంలో ఆమె నాకు ఇన్‌స్పిరేషన్ అన్నారు.