Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..

Updated on: May 15, 2026 | 11:20 AM

ప్రస్తుతం సినీరంగంలో హీరోయిన్లుగా రాణిస్తున్న తెలుగమ్మాయిలలో అనన్య నాగల్ల ఒకరు. 2019లో విడుదలైన మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అమ్మడు.

1 / 5
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'మల్లేశం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తెలుగమ్మాయి, పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మెప్పించింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకు ఇండస్ట్రీలో ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ పెళ్లి గురించి మాట్లాడింది.

2 / 5
ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన మొదటి క్రష్ అని అనన్య వెల్లడించింది. తన చిన్నతనంలో అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలు చూస్తూ పెరిగానని, వారి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే, ఇండస్ట్రీలో ప్రత్యేకంగా క్రష్ ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం నాగశౌర్య పేరును ఆమె ప్రస్తావించింది. తనకు కాబోయే లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలనే విషయంపై కూడా అనన్య క్లారిటీ ఇచ్చింది.

3 / 5
 "నాకు కాబోయేవాడు చాలా నిజాయితీగా (Honest) ఉండాలి. ప్రస్తుతం నేను సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఇండస్ట్రీ వ్యక్తులతో రిలేషన్ అంటే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే అక్కడ అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు నాకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు" అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో అలరిస్తుంది.

4 / 5
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి స్పందిస్తూ.. తనకు ఇప్పటివరకు అటువంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోనని, కేవలం తన పని మీద దృష్టి పెడతానని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తన నటనతో , గ్లామర్‌తో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి చేసి, ఆపై హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసింది అనన్య.

5 / 5
నటనపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించారు. అలా ఆమె ప్రతిభను గుర్తించిన దర్శకుడు పద్మరాజన్, 2019లో వచ్చిన 'మల్లేశం' చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో మల్లేశం భార్య పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం మాత్రం అనన్య కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలలో ఒకరైన 'దివ్య' పాత్రలో ఆమె అద్భుతంగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు.

Follow Us