1 / 5
ఇటీవల కాలంలో సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. ఇదే పందాలో మెగా డాటర్ నిహారిక దంపతులు కూడా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. 2020 డిసెంబర్ 9న చైతన్య, నిహారికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట సోషల్ మీడియాలో సైలెంట్ అవ్వడంతో అనుమానం రేకెత్తింది. నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని.. విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా నెట్టింట వార్తలు జోరందుకున్నాయి.