
ఇప్పటికే ఒకే ఫ్రేమ్‌లో నూతన వధూవరులతోపాటు.. మెగా, అల్లు హీరోలంతా కలిసి ఉన్న ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్, చరణ్ కలిసి చిరునవ్వులు చిందిస్తూ నడుస్తున్న ఫోటో చూసి మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.

కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ తన ఫ్యామిలీ పిక్ షేర్ చేశారు అల్లు అర్జున్. తన సతీమణి స్నేహారెడ్డి, కుమారుడు అయాన్, కూతురు అర్హతో కలిసి దిగిన పిక్ ఆకట్టుకుంటుంది.

ఇక తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లిలో నిహారిక సందడి గురించి చెప్పక్కర్లేదు. తన తండ్రి నాగబాబుతో కలిసి ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేశారు. తాజాగా కొత్త జంటతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. వదినమ్మ వచ్చేసిందంటూ రాసుకోచ్చారు.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి టాలీవుడ్ హీరో నితిన్ తన సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు. తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ ఫోటో షేర్ చేశారు నితిన్.

వరుణ్ తేజ్.. లావణ్య పెళ్లిలో మెగా హీరోల సందడి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ తోపాటు సన్నిహితులు హాజరయ్యారు.