Rajeev Rayala |
Jun 02, 2022 | 9:08 PM
చక్రవర్తి పృథ్వీరాజ్ విగ్రహానికి నివాళులర్పించిన అక్షయ్ కుమార్
పృథ్వీరాజ్ సినిమా విడుదలకు ముందే దేశంలోని వివిధ నగరాల్లో చిత్రబృందం ప్రమోట్ చేస్తోంది.
ఢిల్లీలోని ఖిలా రాయ్ పితోరా కోటను పృథ్వీరాజ్ చిత్రయూనిట్ సందర్శించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న పృథ్వీరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు హీరో అక్షయ్
అక్షయ్ తో పాటు మానుషి చిల్లర్ , దర్శకుడు డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది కూడా ఈ కోటను సందర్శించి, కోటలోని పవిత్ర సోమనాథ్ ఆలయాన్ని, గంగా నదిని దర్శించుకున్నారు.
చక్రవర్తి పృథ్వీరాజ్ విగ్రహం వద్ద ఫోటోలకు ఫోజులిచ్చారు అక్షయ్ తో పాటు మానుషి చిల్లర్. జూన్ 3న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.