
అక్షయ్ కుమార్ అంటే ఒకప్పుడు హిట్ మిషన్.. తన స్టార్ పవర్‌తో ఖాన్స్ త్రయానికి కూడా చెమటలు పట్టించిన యాక్షన్ హీరో.. కానీ టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా..! అందుకే అక్షయ్‌కు కూడా బ్యాడ్ టైమ్ మొదలైంది.

కొన్నేళ్లుగా ఈయన నుంచి చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. వచ్చిన సినిమాలేమో అస్సలు ఆడట్లేదు.. కొన్నైతే వచ్చినట్లు కూడా ఐడియా లేదు. బాలీవుడ్‌లో బయోపిక్స్, రియల్ ఇన్సిడెంట్స్‌పై సినిమాలు చేయాలంటే అక్షయ్ కుమార్‌ను మించిన ఆప్షన్ మరొకరు లేరు.

ఈ మధ్యే ఈయన నటించిన కేసరి 2 విడుదలైంది. కరణ్ సింగ్ త్యాగీ తెరకెక్కించిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది. 1919 జలియన్‌వాలా బాగ్ ఘటన నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. టాక్ బాగున్నా.. కలెక్షన్లు అయితే ఊహించినంత రాలేదు.

అక్షయ్ కుమార్ గత సినిమా స్కై ఫోర్స్‌కు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్లు రాలేదు. వరస ఫెయిల్యూర్స్‌తో అక్షయ్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఈ టైమ్‌లో మంచి సినిమాలు వచ్చినా.. ఆడియన్స్ పట్టించుకోవట్లేదు.

తాజాగా కేసరి 2 సినిమాను మే 23న తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా మన ఆడియన్స్‌కు నచ్చుతుందా అనేది ఆసక్తికరమే. ఈ సినిమా రానున్న విజయాన్ని సాధిస్తే.. అక్షయ్ కెరీర్ గాడిలో పడినట్టే.