ఇటీవల ప్రభాస్ నటించిన ' ఆదిపురుష్'లో హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఇందులో సీత పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో కృతికి తెలుగులో మరోసారి నిరాశే ఎదురైంది. ఆదిపురుష్ తర్వాత గణ్‌పత్ అనే ఓ యాక్షన్ సినిమాలో నటిస్తోంది కృతి సనన్.