
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కొన్నాళ్లుగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ తాప్సీ. ఒకప్పుడు తెలుగులో రవితేజ, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి స్టార్ డమ్ అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హిందీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం తాప్సీ హిందీలో గాంధారీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి నిర్మాత దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి BTS ఫోటోస్ షేర్ చేసింది తాప్సీ.

అందులో తన ముఖం కనిపించకుండా ఉన్న పిక్స్ షేర్ చేస్తూ.. "కష్టతరమైనప్పుడు.. కష్టమైనది కూడా ముందుకు సాగుతుంది. గాంధారి మాకు ఇచ్చిన ప్రేరణ, అనుభవాన్ని గ్రహించే లైన్ ఇది"

"మేము నెమ్మదిగా మా చివరి గమ్యం వైపు వెళ్తున్నప్పుడు మేము గాజు పైకప్పును సైతం బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడూ చేయనిది సైతం ఏదైనా చేయాలనుకుంటే.. ఎప్పుడూ చేయనిది చేయాలి" అంటూ రాసుకొచ్చింది.