Sreeleela: ఎంబీబీఎస్ ఎగ్జామ్స్.. ఆ యంగ్ హీరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న శ్రీలీల ?.. నిజమేంత..
ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది శ్రీలీల. ఇందులో తండ్రికూతుర్లుగా బాలయ్య, శ్రీలీల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆమె నటిస్తోన్న ఆదికేశవ విడుదలకు సిద్ధమవుతుంది. ఈసినిమానే కాకుండా నితిన్ జోడిగానూ నటిస్తోంది. అలాగే ఆమె చేతిలో దాదాపు ఇంకా ఆరు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరో విజయ్ దేవరకొండ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది.