Rajitha Chanti |
Jun 02, 2022 | 1:06 PM
శ్రియా సరన్.. ఇష్టం సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ..
అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి...అగ్ర కథానాయికగా దూసుకుపోయింది.
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
శ్రియా 1982లో సెప్టెంబరు 11న హరిద్వార్ లో జన్మించింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శ్రియా.. ఇష్టం సినిమాతో చిత్రపరిశ్రమ అరంగేట్రం చేసింది.
2018 మార్చి 19న తన బాయ్ ఫ్రెండ్ అయిన రష్యాన్ కు చెందిన ఆండ్రీ కోషివ్ ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి రాధ అనే పాప ఉంది.
అగ్రకథానాయిక చిత్రపరిశ్రమలో చక్రం తిప్పిన శ్రియా.. వివాహం అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించింది. ఓవైపు వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫాంపై కూడా అరంగేట్రం చేసింది శ్రియా.