Rajeev Rayala |
Jan 02, 2024 | 5:25 PM
సీనియర్ హీరో రాజశేఖర్ కూతురులు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేకర్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇద్దరూ ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. ఇక 2021లో వచ్చిన శివాని రాజశేఖర్ అద్భుతం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవలే ఈ అమ్మడు కోట బొమ్మాళి పీ.ఎస్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.
సినిమాలతో పాటు డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆహా నా పెళ్ళంట అనే వెబ్ సిరీస్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి