
రాశీ ఖన్నా.. 1990లో ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు అసలు నటనపై అంతగా ఆసక్తి లేదు. మొదట్లో ఆమె ఐఏఎస్ అధికారి కావాలనుకుంది. లేదంటే మంచి గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది.

కళాశాల రోజుల్లో ప్రకటనలలో మోడల్‌గా చేసిన ఆమె 2013లో షూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం "మద్రాస్ కేఫ్"లో సహాయ పాత్రతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. ఈ సినిమాలో నటించి జనాల దృష్టిని ఆకర్షించింది.

ఆ తర్వాత 2014లో విడుదలైన తెలుగు చిత్రం ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పలు సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ చిత్రం తరువాత, ఆమె 2018లో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన "ఇమైక్క నోడ్గల్" చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలలో నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

ప్రస్తుతం అగస్త్య చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ లో విడుదల కానుంది. మరోవైపు తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది.