ప్రణీత సుభాష్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాపుగారి బొమ్మగా క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
బావ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రణీత. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ అదృష్టం మాత్రం అంతగా రాలేదు.
పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్ చిత్రాల్లో నటించింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సమంత నటించిన అత్తారింటికి దారేది చిత్రంలో నటించి క్లిక్ అయ్యింది.
ఈ సినిమాల తర్వాత ప్రణీతకు తెలుగులో అవకాశాలు అంతగా రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2021లో బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం జరిగింది.
వీరికి గతేడాది జూన్ 10న పాప జన్మించింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ప్రణీత..
తాజాగా పట్టుచీరలో కుందనపు బొమ్మలా ముస్తాబయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
తాజాగా పట్టుచీరలో కుందనపు బొమ్మలా ముస్తాబయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.