
ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న చిన్నది ప్రణీత. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి సినిమాతోనే, మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత ఈ అమ్మడుకు వరుసగా ఆఫర్స్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటలేకపోయింది.

ఇక ఈ బ్యూటీ సిద్ధు సరసన బావ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. చూడగానే ఆకట్టుకునే అమాయకు చూపుతో అభిమానులను తన మాయలో పడేసింది ఈ ముద్దుగుమ్మ .ఇక ఈ మూవీ తర్వాత అత్తారింటికి దారేది సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ చిన్నది.

ఈ మూవీతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తర్వాత పాండవులు పాండవులు తుమ్మెద, రభస, హలో గురు ప్రేమ కోసమే వంటి చిత్రాల్లో నటించింది.ప్రణీత బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని 2021లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, వీరికి ఒక పాప, బాబు జన్మించాడు.

ఇక ఎప్పుడూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ చిన్నది దానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ దుబాయ్ వెడ్డింగ్‌లో ఎంజాయ్ చేసిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.