
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రగ్య జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.

సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగ్య డాకు మహారాజ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాల్సి వస్తే హీరో పాత్రకు సల్మాన్ ఖాన్ సెట్ అవుతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో హీరో పాత్ర విభిన్నంగా ఉంటుందని.. తప్పకుండా సల్మాన్ కు సెట్ అవుతుందని అన్నారు.

అలాగే ఇందులో గుర్రపు స్వారీకి సంబంధించిన సన్నివేశాలు సైతం ఎక్కువగా ఉంటాయని.. అలాంటి సీన్స్ సల్మాన్ కు సరిగ్గా సెట్ అవుతాయని అన్నారు. డాకు మహారాజ్ పాత్రకు ఆయన ప్రాణం పోయగలడు అని చెప్పుకొచ్చింది.

దర్శకుడు బాబీ తనకు కావేరి పాత్ర గురించి చెప్పినప్పుడు సవాలుగా అనిపించిందని.. కావేరీ ప్రెగ్నెంట్ అవుతుందని సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసి భయపడ్డానని.. నటిగా తనకు అద్భుత అవకాశమని అన్నారు.