Actress Poorna: పెళ్లి రోజు స్పెషల్.. అందమైన ఫొటోలు షేర్ చేసిన నటి పూర్ణ..

|

Oct 27, 2024 | 7:27 PM

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు టీవీషోలతో బిజీ బిజీగా ఉంటోంది టాలీవుడ్ నటి పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీమ్. అదే సమయంలో తన కుమారుడి ఆలనా పాలనలో కూడా తలమునకలవుతోంది.

1 / 5
శ్రీమహలక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కు పరిచయమైంది మలయాళీ ముద్దుగుమ్మ పూర్ణ. ఆ తర్వాత  వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

2 / 5
 ఇక సుమారు రెండేళ్ల క్రితం సైలెంట్ గా పెళ్లిపీటలెక్కిందీ ముద్దుగుమ్మ. దుబాయ్ కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తతో కలిసి నిఖా చేసుకుంది.

3 / 5
 ప్రస్తుతం పూర్ణ- ఆసిఫ్ లకు ఒక బాబు ఉన్నాడు. కాగా ఈ అందాల తార వివాహ బంధంలోకి అడుగు పెట్టి రెండేళ్లు పూర్తయింది.

4 / 5
ఈ సందర్భంగా తమ పెళ్లినాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది పూర్ణ.  'నా హృదయంలో చోటిస్తే.. తన జీవితాన్నే ఇచ్చేశాడు' అని వీటికి క్యాప్షన్ ఇచ్చిందీ ముద్దుగుమ్మ.

5 / 5
 ప్రస్తుతం పూర్ణ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూర్ణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.