
నిత్యం కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌లతో, ట్వీట్‌లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంటుంది అందాల భామ పూనమ్ కౌర్.

పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

అయితే నిత్యం సోషల్ మీడియాలో రకరకాల పోస్ట్లు పెడుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఈ చిన్నది.

ఇక ఇటీవల గురు అంటూ దాసరి నారాయణరావును తలచుకొని ఓ ట్వీట్ పెట్టి హాట్ టాపిక్‌గా మారింది.

అలాగే ప్రకాశ్ రాజ్‌ను 'మా' అధ్యక్ష ఎన్నికల్లో గెలిపిస్తే తాను ఎంతో కాలంగా నిశబ్దంగా ఎదుర్కొంటున్న సమస్యలను బయట పెడతానంటూ.. రచ్చ చేసింది.

తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో కొన్ని పోటోలను పోస్ట్ చేసింది.

పూనమ్ కౌర్ సోషల్ మీడియాలోషేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.