
అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు.. వరుసగా సినిమాలు చేస్తున్న అంతగా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు ఈ అందాల భామకు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తదితర తెలుగు స్టార్ నటులందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.

కానీ కాలం గిర్రున తిరిగింది. గత మూడు సంవత్సరాలుగా పూజా హెగ్డే ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. వరుసగా హిట్ సినిమాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చిన ఆ నటి ఇప్పుడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు! ఇటీవలే సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమాలో హీరోయిన్ గా చేసింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో పేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. పూజా హెగ్డే హీరోయిన్ గా చేసిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా రీసెంట్ గా వచ్చిన రెట్రో ఇలా వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను నిరాశపరిచాయి.

వరుసగా ఏడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడికి వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే దుల్కర్ సల్మాన్ ఖాన్ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది.

నేడు పూజా హెగ్డే పుట్టిన రోజు నేడు.. ఈ అందాల భామ పుట్టిన రోజు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు.