
అందంతో పాటు అభినయం ఉన్న నటీమణుల్లో మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ ఒకరు. 1995, నవంబర్ 2న జన్మించిన ఈ అందాల తార బాలనటిగా కెరీర్ మొదలు పెట్టింది. అనంతరం మోడల్‌గా మారి సినిమాల్లో నటించే చాన్స్ కొట్టేసింది.

నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్ మన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ తార అనతి కాలంలోనే తెలుగులోనూ మంచి నటిగా గుర్తింపు సంపాదికుంది. నిన్నుకోరి, జైలవకుశ, 118, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో నటించి కుర్రకారును ఆకట్టుకుంది.

మలయాళంలో వచ్చిన వెరుథె ఒరు భార్య సినిమాలో అద్భుత ప్రదర్శనను కనబరిచిన నివేదా.. కేరళ రాష్ట్ర ఉత్తమ యువ నటి పురస్కారం అందుకుంది. వీటితో పాటు పలు అవార్డులను సైతం అందుకుంది నివేదా.

సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న నివేదా.. ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారోను అధిరోహించి అందరి దృష్టిని ఆకర్షించింది.

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది నివేదా. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ పంచుకుంటుంది.

మరి ఈ అందాల తార ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా తన సినిమాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలని కోరుకుంటూ టీవీ 9 తరఫున నివేదాకు జన్మదిన శుభాకాంక్షలు.