
టాలీవుడ్ అడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో కథానాయికగా నటిస్తుంది నిధి అగర్వాల్. అలాగే ప్రభాస్ జోడిగా రాజా సాబ్ మూవీలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది.

ప్రస్తుతం ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో నటిస్తున్న నిధి.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. అయితే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు నిధి అగర్వాల్ ఎన్నో కష్టాలు ఎదుర్కొందట.

చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే చాలా ఇష్టమట. దీంతో చిన్నప్పటి నుంచి సినిమాలు ఎక్కువగా చూసేదట. దీపికా పదుకొణెను చూసి తాను కూడా సినిమాల్లోకి రావాలనుకున్నానని.. అయితే ఇంట్లో చెబితే ముందు చదువుకో అన్నారని తెలిపింది.

చదువు పూర్తయ్యాక ముంబై వెళ్లి సినీ అవకాశాల కోసం చాలా ట్రై చేసిందట. తన ఫోటోస్ పట్టుకుని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినట్లు వెల్లడించింది. ఛాన్స్ ఇవ్వకపోయినా తనను పదే పదే ఆఫీసుల చుట్టూ తిప్పుకున్నారని.. రెండేళ్లు ఆఫర్స్ కోసం ట్రై చేసినట్లు తెలిపింది.

మూడొందల మందిని ఆడిషన్ చేసి చివరకు తనను మున్నా మైఖేల్ కోసం సెలక్ట్ చేశారని.. అలా హీరోయిన్ గా ఫస్ట్ ఛాన్స్ అందుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులో సవ్వసాచి సినిమాలో అవకాశం వచ్చిందని.. ఇప్పుడు తెలుగులో రెండు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపింది.