
నిత్యం సినిమా షూటింగులతో బిజి బిజీగా ఉండే నయన తార ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుంటోంది. కెమెరా లైట్లకు దూరంగా తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు తమ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

వెకేషన్ లో భాగంగా తాజాగా హాంకాంగ్ లోని డిస్నీల్యాండ్ రిసార్ట్‌కు వెళ్లింది నయనతార ఫ్యామిలీ. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనలయ్యాడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.

'12 ఏళ్ల క్రితం కాళ్లకు చెప్పులు వేసుకుని కేవలం వెయ్యి రూపాయలతో ఇక్కడ నిల్చున్నాను. పోడా పొడి షూటింగ్ కోసం అనుమతివ్వమని అర్థించాను' అని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు విఘ్నేశ్.

'మళ్లీ పుష్కరకాలం తర్వాత మరోసారి నా లవ్లీ బేబీస్ నయనతార, ఉయిర్, ఉలగ్‌తో డిస్నీలాండ్ రిసార్ట్‌లో అడుగుపెట్టాను. జీవితం ఎంత అందమైనది' అని ఎమోషనలయ్యాడు నయన తార భర్త.

ఇక ఈ వెకేషన్ లో నయనతార కుమారులు ఉయిర్, ఉలగ్‌లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరి ఫొటోలను చూసిన అభిమానులు, నెటిజన్లు ఎంతో క్యూట్ గా ఉన్నారంటున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. నయనతార చివరిగా అన్న పూరణి అనే సినిమాలో నటించింది. అంతకు ముందు షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో సందడి చేసంది.