
ప్రస్తుతం తెలుగులో మోస్ట్ క్రేజీ హీరోయిన్. ఇప్పుడిప్పుడే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ అందుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ వయ్యారి.. ఒకప్పుడు ట్రోల్స్ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ప్రస్తుతం నెట్టింట ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.. ?

ఈ ఏడాది ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటించిన చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ మీనాక్షి చౌదరి. గతేడాది లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు రాబట్టింది.

ఇందులో మీనూ పాత్రలో అదరగొట్టేసింది. ఇదిలా ఉంటే.. గతంలో తమిళంలో విజయ్ దళపతి హీరోగా నటించిన గోట్ చిత్రంలో నటించింది. ఈ సినిమా తర్వాత తనపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారట. ఆ వీడియోస్ చూసి తన చాలా బాధపడ్డానని.. దాదాపు వారం రోజులు డిప్రెషన్ లోకి వెళ్లానని తెలిపింది.

ఆ తర్వాత వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా తన మానసిక స్థితిని మార్చిందని.. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకొచ్చింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి నటనకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తన సినిమాల కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్లు తీసుకుంటున్నట్లు తెలిపింది.