
సౌత్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్న హీరోయిన్లలో మంజు వారియర్ ఒకరు. 46 ఏళ్ల వయసులోనూ కుర్ర భామలకు గట్టిపోటీనిస్తుంది. మలయాళీ చిత్రపరిశ్రమలో ఆమె లేడీ సూపర్ స్టార్.

14 ఏళ్లపాటు నటనకు దూరంగా ఉన్న ఈ భామ.. ఇప్పుడు దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలలో ఒకరు. ప్రస్తుతం మంజు తన సినిమాలకు రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వసూలు చేస్తుందని సమాచారం.

మలయాళీ సినిమాకు రూ.50 లక్షలు, తమిళ చిత్రాలకు రూ.1 కోటి వసూలు చేస్తుందని సమాచారం. సినిమాలే కాకుండా అటు ప్రకటనలతోనూ భారీగానే సంపాదిస్తుంది.

నివేదికల ప్రకారం మంజు వారియర్ ఆస్తులు మొత్తం దాదాపు రూ.150 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 19 ఏళ్లకే నేషనల్ అవార్డ్ అందుకున్న మంజు.. 20 ఏళ్ల వయసులోనే తోటి నటుడు దిలీప్ కుమార్ ను వివాహం చేసుకుంది.

వీరికి పాప కూడా జన్మించింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది మంజు వారియర్. కానీ దిలీప్ మరో హీరోయిన్ కావ్యను ప్రేమించడతో అతడి నుంచి డివోర్స్ తీసుకుంది. 14 ఏళ్లకు రీఎంట్రీ ఇచ్చింది.