
మాళవిక నాయర్.. ఈ చిన్నది టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చూడటానికి క్యూట్ గా ఉండే ఈ భామ.. తన నటనతోనూ ఆకట్టుకుంటుంది. నాని నటించిన ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది . నాగ శౌర్య తో కలిసి కళ్యాణమే వైభోగం, ఒరేయ్ బుజ్జిగా, నాగ చైతన్య థాంక్యూ సినిమాల్లో నటించి మెప్పించింది మాళవిక. ఇక ఇప్పుడు ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి అనే సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో మరోసారి నాగ శౌర్యతో జత కట్టింది ఈ భామ.

అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి ఈ భామ స్కిన్ షోకు దూరంగా ఉంటూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ అమ్మడు గ్లామర్ షోకు.. ఇంటెన్స్ సీన్స్ కు ఎలాంటి ఇబ్బంది లేదు అంటుంది. అదే రేంజ్ లో రెచ్చిపోతుంది కూడా.. మొన్నామధ్య ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి సినిమాలో గ్లామర్ టచ్ ఇచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో ఇంటెన్స్ సీన్స్ లో నటించడం పై స్పందిస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది మాళవిక. తనకు ఇంటెన్స్ సీన్స్ లో, బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపింది. అవి కావాలని చేసేవి కాదు.. సినిమా కోసం చేసేవి. సీన్ కు తగ్గట్టుగా చేయాల్సిందే.. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపింది మాళవిక.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.