
వెండితెరపైకి ఉప్పెనలా దూసుకొచ్చి.. అందం.. అభినయంతో కుర్రకారు గుండెల్లో సునామీ సృష్టించింది కృతిశెట్టి. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

తాజాగా కస్టడీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన సినిమాల గురించి మాత్రమే కాకుండా.. పెళ్లి, కాబోయే వాడి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది కృతి శెట్టి.

'నాకు కాబోయేవాడు చాలా సింపుల్‌గా, నిజాయితీగా ఉండాలి. కాస్త బొద్దుగా కూడా ఉండాలి. ఇంట్లోవాళ్లు నన్ను ముద్దుగా ‘బుంగి’ (Bungi) అని పిలుస్తుంటారు. ‘బంగార్రాజు’లో నేను పోషించిన పాత్రంటే మా నాన్నకు ఎంతో ఇష్టం' అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే రామ్ చరణ్, శివకార్తికేయన్ అంటే చాలా ఇష్టమని.. తనకు అలియా భట్ స్పూర్తి అని... తన స్టోరీ సెలెక్షన్ నచ్చుతుందని తెలిపింది.

'‘ఉప్పెన’ చూసి చిరంజీవిగారు నాకొక గిఫ్ట్, లెటర్ పంపించారు. ఆ లెటర్‌లో ‘యూ ఆర్ ఏ బోర్న్ స్టార్’ (You are A Born Star) అని రాసుంది. అది చూసి నేను కాస్త భావోద్వేగానికి గురయ్యాను. ఆ లెటర్‌ను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నా' అంటూ చెప్పుకొచ్చింది.