
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాల్లో టాక్సిక్ ఒకటి. ఇందులో కన్నడ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తాజాగా కియారా అద్వానీ ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక మార్పులు చేయాలని మేకర్స్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం కియారా పేరు మారుమోగుతుంది.

నెట్టింట వైరలవుతున్న టాక్ ప్రకారం ‘టాక్సిక్’ చిత్రంలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని లేదా ఎడిట్ చేయాలని కియారా చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. ఈ సినిమాలో కియారా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, అయితే కథలో భాగంగా ఉన్న కొన్ని సీన్ల విషయంలో ఆమె కొంత అసౌకర్యానికి గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యశ్ వంటి పాన్ ఇండియా స్టార్ సరసన నటిస్తున్నప్పుడు, తన ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సాధారణంగా కియారా అద్వానీ గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరు అయినప్పటికీ, కథలో ప్రాధాన్యత , బోల్డ్ సన్నివేశాల పట్ల ఆమె ఆచితూచి వ్యవహరిస్తోందని టాక్. ఇప్పుడు ‘టాక్సిక్’ చిత్రం విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ చిత్రం మాఫియా, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ కావడం వల్ల ఇందులో పలు సన్నివేశాలు ఉండటం సహజం. కానీ, కుటుంబ ప్రేక్షకులు కూడా తన సినిమాను చూడాలనే ఉద్దేశంతో కియారా ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ విషయంలో కియారా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. నటీనటుల సౌకర్యం, కథా గమనాన్ని బట్టి అవసరమైన మార్పులు చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. యశ్ కూడా క్రియేటివ్ విషయంలో , సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేజీఎఫ్ 1, 2 చిత్రాల తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై పాన్ ఇండియా లెవల్లో అంచనాలు నెలకొన్నాయి.

కియారా అద్వానీ.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హాత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. తర్వాత ప్రెగ్నెంట్, పాప పుట్టిన చాలా నెలల వరకు ఆమె సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఇందులో మరోసారి గ్లామరస్ లుక్ లో కనిపించనుంది. చివరకు కియారా వార 2 చిత్రంలో కనిపించింది. ఇందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు.