
డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది హాట్ బ్యూటీ కేతిక శర్మ.

రొమాంటిక్ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది కేతిక శర్మ. ఆ తర్వాత నాగశౌర్య నటించిన లక్ష్య సినిమాలో నటించింది ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.

ఆతర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగరంగవైభవంగా అనే సినిమాలో నటించింది. అయినా కూడా సక్సెస్ సాధించలేకపోయింది.

రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తోంది గ్లామరస్ బ్యూటీ కేతిక. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి .