
హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇన్నాళ్లు సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ఓం శాంతి శాంతి శాంతిః చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడంతో ప్రచారానికి మరింత బలం చేకూరింది. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం జనవరి 30న రిలీజ్ కానుంది.

మలయాళంలో వచ్చిన జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఈషా.. తన డేటింగ్ రూమర్స్ పై స్పందించింది. మీరిద్దరు రియల్ లైఫ్ లోనూ జోడియేనా అన్న ప్రశ్నకు తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు.

ఏదో ఒక రకంగా వార్తలలో ఉండడం మంచిదే.. అయితే దేనిపైనా క్లారిటీ ఇవ్వదల్చుకోలేదు. ఏదైనా ఉండే నేనే అందరికీ చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది. ఆమె రూమర్స్ ను ఖండించనూ లేదు.. ఒప్పుకోనూ లేదంటే ఏదో ఉందని నెటిజన్స్ అంటున్నారు.

అలాగే ఈ సినిమాను తనను తరుణ్ నిజంగానే కొట్టాడని చెప్పుకొచ్చింది. ఒక సన్నివేశంలో చట్నీ నా చెంపకు అంటాలని దర్శకుడు చెప్పాడు. అప్పుడు తరుణ్ భాస్కర్ నన్ను గట్టిగా కొట్టాడు. నేను అస్సలు ఊహించలేదు. తెలియకుండానే నా కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి అని తెలిపింది.