
అందాల భామ అంజలి.. మన తెలుగమ్మాయే అయినప్పటికీ ముందుగా తమిళ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో నటించి మంచి హిట్స్ అందుకుంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. షాపింగ్ మాల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి.

అలాగే హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది అంజలి. సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ అమ్మడుకి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో కీలక పాత్రలో నటించింది.

అలాగే సూర్య సింగం2, అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది. అటు తమిళ్ సినిమాల్లోనూ.. ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తుంది అంజలి. కొన్ని వెబ్ సిరీస్ ల్లోనూ ఈ చిన్నది నటిస్తుంది.

చివరిగా అంజలి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత అంజలి స్పీడ్ తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.