
జీవితంలో కొత్త దశను ప్రారంభించారు హీరోయిన్ అమలా పాల్. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను ఆదివారం రెండో వివాహం చేసుకున్నారు అమలా. కేరళలోని కొచ్చిలో నవంబర్ 5న సాయంత్రం వీరి వివాహం ఘనంగా జరిగింది.

తమ పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పెళ్లి ఫోటోలను షేర్ చేసుకున్నారు హీరోయిన్ అమలా పాల్. 'రెండు మనసులు ఒక్కటైన వేళ.. జీవితాంతం ఈ చేయి వదలను' అంటూ తమ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు వీరిద్దరు.

పెళ్లి వేడుకలో అమలా పాల్ లావెండర్ కలర్ లెహంగా ధరించగా.. ఆమె ప్రియుడు జగత్ సైతం ప్రియురాలికి మ్యాచింగ్ గా లావెండర్ కలర్ షేర్వాణి ధరించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

కాగా అక్టోబర్ 26న అమలా పాల్ బర్త్ డే సందర్భంగా ఆమెకు ప్రపోజ్ చేశాడు జగత్. బర్త్ డే పార్టీలో మోకాళ్లపై కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా ? అని అందరి ముందే అడిగాడు. మొదట సర్ ప్రైజ్ అయిన అమలా.. ఆ తర్వాత నవ్వుతూ ఓకే చెప్పేసింది.

అమలాపాల్ 2014లో తమిళ దర్శకనిర్మాత ఏఎల్ విజయ్ ను పెళ్లాడింది. కానీ కొంతకాలానికే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవడం మంచిదని నిర్ణయానికి వచ్చారు. 2017లో విడాకులు తీసుకున్నారు.

ప్రపోజ్ చేసిన పదిరోజుల్లోనే రెండో పెళ్లి చేసుకున్న అమలా పాల్.. నెట్టింట ఫోటోస్ వైరల్..