
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఇందులో ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో కథానాయిక ఐశ్వర్య లక్ష్మి విలేఖరుల సమావేశంలో 'మట్టి కుస్తీ' విశేషాలని పంచుకున్నారు.

ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పాను.

తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది.

తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. నటీనటులందరూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి కృషి చేస్తారు. ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలు చేస్తారు అని తెలిపింది.

టాలీవుడ్ లో సాయి పల్లవి, సత్యదేవ్ లతో పరిచయం వుంది. అలాగే తెలుగులో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాను అని తెలిపింది.

ఇటీవల చెన్నైలో జరిగిన ఆడియో ఫంక్షన్లో ఐశ్వర్య ఈ సినిమా విజయంపై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుంది.

ఈ సందర్భంగా.. మీకు ప్రేమ వివాహాం ఇష్టమా ? పెద్దలు నిశ్చయించిన పెళ్లి ఇష్టమా ?.. ప్రశ్నకు అశలు పెళ్లే ఇష్టం లేదని చెప్పుకొచ్చింది.