భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య తొలిసారి నిర్మాతలుగా మారిన సంగతి తెలిసిందే. వీరి నిర్మాణ సంస్థపై నిర్మించిన తొలిచిత్రం 'ఎల్‌జీఎం (లెట్స్ గెట్ మ్యారీడ్). ఈ మువీలో హరీశ్ కల్యాణ్, ఇవానా ప్రధాన పాత్రలో నటించారు.
ఈ మువీ ట్రైలర్‌ను సోమవారం (జూలై 10న) విడుదల చేశారు. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న హాస్యనటుడు యోగి బాబు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో తనను ప్లేయర్‌గా నియమించమని ధోనీని అడిగాడు. అందుకు ధోనీ ఇచ్చిన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
రాయుడు (అంబటి) రిటైర్డ్ అయ్యాడు. కాబట్టి, సీఎస్‌కేలో మీకు వేకెన్సీ ఉంటుంది. నేను కూడా మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతాను. కానీ, మీరు సినిమాల్లో చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా మారు అడవచ్చు. ఐతే వాళ్లు చాలా వేగంగా బౌలింగ్ చేస్తారు. మీకు ఖచ్చితంగా గాయాలవుతాయంటూ ఫన్సీ ఆన్సర్ ఇచ్చారు.
కాగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఎల్‌జీఎం ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. రమేష్ తమిళమణి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మువీలో నదియా, యోగిబాబు, మిర్చి విజయ్‌లు కీలకపాత్రలో కనిపించనున్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.