ప్రముఖ హీరోయిన్ నిత్యా మేనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. ముఖ్యంగా ఓటీటీల్లో ఆమె నటించిన సినిమాలు, సిరీస్‌లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నిత్య నటించిన ‘బ్రీత్.. ఇన్ టు ద షాడోస్’, సీజన్ 1’, సీజన్2, ‘మోడ్రన్ లవ్’ వెబ్ సిరీస్‌లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి.

మాస్టర్ పీస్ పేరుతో తెరకెక్కిన ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది.

కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఆద్యంతం నవ్వులు పంచేలా మాస్టర్ పీస్‌ను డైరెక్టర్ శ్రీజిత్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రియా అనే పాత్రలో నిత్య కనిపించనుంది. నిత్య తో పాటు షరాఫ్, రెంజి పనికర్, మాలా పార్వతి, అశోకన్, శాంతి కృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

తిరు సినిమా తర్వాత మరోసారి ధనుష్‌తో కలిసి (D51) నటిస్తోంది నిత్య. దీంతో పాటు కోలాంటి, ఆరమ్ తిరుకల్పన వంటి మలయాళ మూవీస్‌తో పాటు ఒక తమిళ సినిమా ఆమె చేతిలో ఉన్నాయి.