
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఎంతో ఇష్టంగా చికెన్ తింటుంటారు. అయితే చికెన్ తినడం ఇష్టమే అయినప్పటికీ కొన్ని సార్లు దాని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు కానీ, చిన్న పిల్లలు చికెన్ ముక్క తిన్నప్పుడు అది గొంతులో ఇరుక్కుపోతుంది. ఇలా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కాగా, అసలు చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయినప్పుడు దానిని సులభంగా ఎలా తొలిగించాలో ఇప్పుడు చూసేద్దాం.

కొంత మందికి చికెన్ తింటున్న సమయంలోనే అది గొంతులో సహజంగా ఇరుక్కుపోతుంది. మొదట గొంతులో ఏదో అడ్డు పడినట్లుగా అనిపించి, తర్వాత ఊపిరి ఆడకపోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురు అవుతాయి. ఎవరు అయితే దానిని సమయానికి గుర్తించి, త్వరగా చికిత్స తీసుకుంటారోవారు ప్రాణాలతో బయటపడతారు. కానీ ఆలస్యం చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుపోయినప్పుడు ఎప్పుడూ కూడా భయపడకూడదు. ఒక వేళ మీరు భయపడి ఆందోళనకు గురి అవుతే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. అయితే గొంతులో ఉన్న చికెన్ ముక్క బయటకు రావాలి అంటే కాస్త గట్టిగా దగ్గాలి. అప్పుడు అది బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంతే కాకుండా చికెన్ ముక్క గొంతులో ఇరుక్కపోయినప్పుడ అన్నం తినడం, నీళ్లు తాగడం లాంటిది అస్సలే చేయకూడదు. ఇది సమస్యను తీవ్రతరం చేస్తుంది.

అదే విధంగా ప్రథమ చికిత్స అందించాలి. కొన్నిసార్లు దీని వలన కూడా డాక్టర్‌తో పని లేకుండా చికెన్ ముక్క చాలా త్వరగా బయటపడే ఛాన్స్ ఉంది. దీని కోసం ముందుగా ఎవరికి అయితే చికెన్ ముక్క గొంతులో చిక్కుకుందో, వాళ్ల నడుము భాగాన్ని చేతులతో గట్టిగా చుట్టాలి. తర్వాత ఒక చేతితో పిడికిలి బిగించి, బొటనవేలు వైపు భాగాన్ని బాధితుడి పొత్తికడుపుపై నాభికి కొద్దిగా పెట్టాలి.

తర్వాత రెండో చేతితో ఆ పిడికిలిని పైకి గట్టిగా ఒత్తాలి దీని వలన ఒత్తిడి పెరిగి ముక్క త్వరగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ట్రీట్మెంట్ అదరికీ పనికి వస్తుందా అంటే, కొంత మందికే ముఖ్యంగా పెద్దవారికి మాత్రమే ఇది కొన్నిసార్లు ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలకు, గర్భిణీకు ఈ చిట్కా పని చేయదు. అంతే కాకుం పైన చెప్పిన చిట్కాలు అన్నీ కూడా కొంత వరకు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ సాధ్యమైనంత వరకు చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయిన సమయంలో వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం అవసరం. ఎందుకంటే? ఏ మాత్రం ఆలస్యం జరిగినా అది ప్రాణానికే ముప్పు తీసుకొస్తుంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.