
‘సీతా రామం’ సినిమాలో సీతా మహాలక్ష్మిగా సాంప్రదాయమైన పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్, ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

‘సీతా రామం’ సినిమాలో మృణాల్‌తో పాటు దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న తదితరులు కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ప్రేమకథ నేపథ్యమే హైలెట్‌గా చిత్రీకరించిన ఈ సినిమాలో మృణాల్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.

‘సీతా రామం’ సినిమా తర్వాత మృణాల్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో అమెను వెతుక్కుంటూనే ఎన్నో ఆఫర్లు వచ్చాయి.

ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న మృణాల్ తన బ్యాక్‌లెస్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులు మృణాల్‌పై ఉన్న తమ ప్రేమను ఫోటోలకు కామెంట్స్‌గా తెలియజేస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్. క్రమక్రమంగా తన ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది.