Chandrayaan-3: రేపే చంద్రయాన్-3 ప్రయోగం.. ఎవరికీ తెలియని ఆసక్తికర వివరాలు ప్రత్యేకంగా మీకోసం..

|

Jul 13, 2023 | 10:46 PM

మన జానపద కథల్లో చంద్రుడికి ప్రత్యేక స్థానముంది. చందమామ అని ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటూ ఉంటాం. అలాంటి మనందరి మూన్‌ మిషన్‌కు చంద్రయాన్‌-3ని చేరువ చేసేందుకు బాహుబలి రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ఫెయిల్యూర్‌ ఆధారిత విధానంతో అభివృద్ధి చేసిన టెక్నాలజీతో చంద్రయాన్‌ 3 ప్రయోగం రేపు జరగబోతోంది.

1 / 5

2 / 5
ఇప్పటివరకూ చంద్రుడిపైకి రాకెట్లు ప్రయోగించిన ఏ దేశాలు కూడా దక్షిణ ధ్రువంపైపు ల్యాండ్ చేయలేదు. భారత్ మాత్రం దక్షిణ ధ్రువం మీదే ఫోకస్  ఎందుకు పెట్టియో తెలుసుకుందాం. దక్షిణ ధ్రువంలో మైనస్‌ 248 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే అక్కడ హిమరూపంలో నీరు ఉండే అవకాశం ఉంది. మానవసహిత, రోబోటిక్‌ యాత్రలకు ఉపయోగకరంగా ఉంటుంది. కోట్ల సంవత్సరాలుగా సూర్యకాంతి పడని ప్రదేశాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం యొక్క పుట్టుకపై అన్వేషణకు ఉపకరించే అంశాలు లభించొచ్చు.

3 / 5
వాస్తవానికి ప్రపంచ సైంటిస్టులతో పోలిస్తే మన శాస్త్రవేత్తలు చాలా ప్రతిభావంతులని చెప్పుకోవచ్చు. ఇందుకు నిదర్శనమే.. అతి తక్కువ ఖర్చుతో చేస్తున్న రాకెట్ ప్రయోగాలు. కొన్ని ప్రయోగాలైతే.. సినిమా బడ్జెట్‌ల కన్నా తక్కువ ఖర్చుతోనే పూర్తయిన సందర్భాలున్నాయి. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. గ్రావిటీ సినిమాకు పెట్టిన ఖర్చు రూ. 644 కోట్లు, మంగళయాన్ ప్రయోగానికి రూ.470 కోట్లు. గ్రావిటీ సినిమాకు అయిన ఖర్చు రూ. 644 కోట్లు, మంగళయాన్ రూ. 470, మిషన్ మంగళ్ రూ. 70 కోట్లు. ఇంటర్‌స్టెల్లర్ సినిమాకు పెట్టిన బడ్జెట్ రూ.1062 కోట్లు, చంద్రయాన్ 2 రూ.978 కోట్లు. ఆదిపురుష్ సినిమా బడ్జెట్ రూ. 600 కోట్లు, చంద్రయాన్ 3 రూ. 615కోట్లు.

4 / 5
చంద్రుడిపై ఇప్పటికే చాలా దేశాలు ప్రయోగాలు చేశాయి. కానీ 3 దేశాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగిలిన దేశాలు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఎందుకు చంద్రుడిపై ప్రయోగాలు జరుగుతున్నాయో చూద్దాం. భూమితో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతే. ఇతర గ్రహాలపై పరిశోధనలకు ఆవాసంగా మార్చుకోవడం కోసం ఈ ప్రయోగాలు చేస్తున్నారు. భూమితో పోలిస్తే రాకెట్ ప్రయోగాలు సులువు, ఖర్చు తక్కువగా కూడా ఉంటుంది. రేడియోతరంగ, ఖగోళ, భౌతిక పరిశీలనలకు అనువైన వేదికగా ఉంటుంది.

5 / 5
చంద్రుడి పుట్టుక మీద చాలా భిన్నమైన సిద్ధాంతాలున్నాయి. చంద్రుడు భూమి నుంచి విడిపోయాడని అంటారు. అలాగే, భూమిని ఓ పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొనడగా.. పుట్టిన గోళమే చంద్రుడు అని అంటారు. ఇలా రకరకాల సిద్ధాంతాలున్నాయి. చంద్రయాన్ 3 ప్రయోగం వల్ల అవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందని ఇస్త్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.