
ఏ వ్యక్తి అయినా సరే తమ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరితో సంతోషంగా జీవించాలనుకుంటారు. అయితే చాణక్యుడి ప్రకారం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులే ఇంటిలోని ఆనందాన్ని, శ్రేయస్సును నాశనం చేస్తాయంట. అంతే కాకుండా, అవి అనేక సమస్యలకు కారణం అవుతాయంట. అందుకే కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా ఇంటిలో ఆనందకర వాతావరణాన్ని సృష్టించుకోవచ్చునంట.

చాలా మందికి ఉదయాన్నే లేవడం అలవాటు ఉండదు. అయితే అలా తెల్లవారు జాము వరకు నిద్రపోయే వారిలో ఎప్పటికీ లక్ష్మీ దేవి నివసించదంట. అంతే కాకుండా వీరికి ఎప్పుడు అప్పుల సమస్యలు డబ్బుకొరత ఉంటుందని చెబుతున్నా చాణక్యుడు.అలాగే సోమరితనం ఉన్న ఇంట్లో కూడా ఎప్పుడూ ఆనందకర వాతవరణం ఉండదంట.

కొంత మంది ఎంత మంచిగా వంట చేసినా ఆహారాన్ని అవమానిస్తుంటారు. అయితే ఆహారాన్ని అగౌరపరచడం వంటివి చేయడం వలన కూడా సంపద నిలవదంట. ఎప్పుడూ ఆహారాన్ని అగౌరపరిచే వారింట లక్ష్మీదేవి నివసించదు, అలాగే ఆ ఇంటిలో పేదరికం తాండవం చేస్తుందని చెబుతున్నారు.

ఇంట్లో సంపద, ఆనందం నశించిపోవడానికి ముఖ్య కారణం తప్పుడు అనుబంధాలు, అలవాట్లేనంట. ఇంట్లో ఎవరైనా మాదక ద్రవ్యాలకు, మద్యానికి బానిసైతే అటువంటి వారి ఇంట్లో సంపద క్రమంగా తగ్గిపోతుందంట. అందుకే అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెబుతున్నాడు చాణక్యుడు.

అలాగే ఎవరి ఇంట్లోనైతే ప్రార్థనా మందిరం మురికిగా ఉంటుందో ఎవరి ఇంట్లోనైతే పూజ గది బాగుండదో, ప్రతి రోజూ పూజ జరగదో, ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపంగా ఉంటుందంట. అంతే కాకుండా సంపద కూడా తగ్గిపోతుందంట. అందుకే పూజ గది ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోవాలని చెబుతున్నారు పండితులు.