
ఆ చార్య చాణక్యుడు గొప్పరాజకీయ పండితుడు. అంతే కాకుండా ఆయన అన్ని విషయాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. చాణక్యుడు తన జీవితంలోని అనుభవాల ఆధారంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించాడు. దాని ద్వారా ఎన్నో విషయాలను నేటి తరం వారికి తెలియజేయడం వలన అవి వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే చాణక్యుడు ఒక వ్యక్తి తన యవ్వనంలో తప్పకుండా ఐదు పనులు చేయాలని తెలిపాడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

యవ్వనంలో ఒక వ్యక్తి తప్పకుండా తన శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టాలంట. దీని కోసం ప్రతి రోజూ మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం చేయాలని సూచిస్తున్నాడు చాణక్యుడు. అదే విధంగా రెండో పనిలో భాగంగా, ఒక వ్యక్తి తప్పకుండా సామాజిక నైటిక పనిలో చురుకుగా పాల్గొన్నప్పుడే అది ఆయనకు జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. ఇదే గౌరవాన్ని తీసుకొస్తుందంట.

చాణక్యుడు మంచి మిత్రుత్వమే మీ జీవితాన్ని మంచి దారిలో నడిచేలా చేస్తుంది. అంతే కాకుండా జీవితంలో ఉన్నతంగా బతికేలా చేస్తుంది. అందుకే మీరు ఈ వయసులో చెడు సహవాసాలకు దూరంగా ఉండి, మంచి స్నేహితులతో మీ కెరీర్‌కు పునాదులు వేసుకోవాలి. ఇదే మీ జీవితాన్ని మార్చుతుంది అని చెబుతున్నాడు చాణక్యుడు.

ఏ వ్యక్తి అయినా సరే 20 సంవత్సరాల వయసు తర్వాత డబ్బు విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. పొదుపు చేయడం, ఎందులోనైనా పెట్టుబడి పెట్టడం, భవిష్యత్తుకోసం కొంత దాచుకోవడం లేదా ఏదైనా స్థిరాస్థి కొనుగోలు చేయడం లాంటివి చేయడం ప్రారంభించాలంట.

ప్రతి ఒక్కరూ 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి విషయంలో మంచి నైపుణ్యం కలిగి ఉండాలని సూచిస్తున్నాడు ఆచార్య చాణక్యుడు. కొత్త భాష నేర్చుకోవడం, వ్యాపార నైపుణ్యాలు. అందరితో కలివిడిగా మెదలడం, ప్రతి అంశంపై పట్టు ఉండాలి. ఇది మీ జీవితంలోని అడ్డంకులను తొలిగించి, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందంట.